Saturday, July 9, 2011

మదతనం

మనిద్దరమే పడి దొల్లాం కదయ్యా!
నీ పుణ్యాన ఓ బిడ్డని కని తల్లినవుదామనుకున్న!
నిన్ను తండ్రిని చేస్తాను కదా అని మురిసిపోయిన !
నీ 'అమ్మ' అడ పిల్లని వాళ్ళ అమ్మ చంపేసి ఉంటే నువ్వెట్టా పుట్టేవాడివయ్యా!
చంపేసున్నా బాగుండేది!
బిడ్డ పుట్టకముందే చంపే కొడుకు అవుతావని తెలిస్తే నిన్ను పురిట్లోనే చంపేసేదేమో!
తల్లి ఉసూరుమంటూ నీకు ఉసురిస్తుంది!
నిన్ను తండ్రిని చేయడానికి పది నెలలు తల్లడిల్లే తల్లి ఉసురు నీకెందుకు తగులుతుంది?
బొడ్డు తాడు తెగినపుడు కెవ్వుమనే కేకకు ఆడ మగ ఏంటయ్యా ?
నిన్ను పుట్టించినోడికైనా తెలీదు కదయ్యా కడుపులో పడే గుడ్డు ఆడా మగో!
క్షేత్రం నాది ! బీజం నీది!
మోదం మనది! మదం నీది!
నొప్పులు నావి! గొప్పలు నీవి!
నీలాంటి కొడుకును కనాల్సొస్తుందని, నువ్వెత్తిన గొడ్డలికి 'మగతనం' అంటాలని నేనే నీ ముందుకు వచ్చానయ్యా!
నువ్వు నన్నెక్కడ చంపగలవు?
నేను విశ్వవ్యాప్తమైన విరక్తిని!
విసుగెత్తిన శక్తిని!
మూడువైపుల మున్నీటిని నింపుకున్న నడిచే కన్నీటి బొట్టుని!
మదతనానికి గొడ్డలి పెట్టుని!

(ఆడపిల్లలనే వరసగా ప్రసవిస్తోందని గొడ్డలితో దాడి చేసిన భర్త'వార్త 'చదివాక !)

2 comments:

  1. baruvu ga vundi boss ... badhaga kuda vundi boss ... kavitvam verakthi nunchi veraham nunchi pudutunda .. emo ... naku matram na GF ni impress cheyadaniki ... adhi miss itey vodarchadaniki pudtundi ... padhalu bavunai ...bani kuda bavundi ... but visleshana lo kasta bavajalam vuntey adhiripotundi ... KEEP IT UP

    ReplyDelete
  2. వయసులో నేనూ నీలాగే అనుకున్నాను, అప్పుడు రాశాను బాసు! అవి కూడా నెమ్మదిగా వదుల్తా! ఇప్పుడు కవిత్వం ఇలా వస్తోంది! నీ అభిప్రాయం తెలిపినందుకు కృతఙ్ఞతలు. అన్నట్టు మరచాను! ఇప్పుడు కూడా వయసులోనే వున్నాను!

    ReplyDelete